సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ గ్రామ శివారులో గల ఓ కెమికల్ పరిశ్రమలో బుధవారం సాయంత్రం రియాక్టర్ పేలి భారీ అగ్నిప్రమాదం సంభవించిది. భారీగా పేలుడు సంభవించడంతో ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందినట్టు తెలుస్తోంది. మరో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. కెమికల్ పేలుడు వల్ల పెద్దఎత్తున చెలరేగుతున్న మంటలు మంటల్లో పలువురు కార్మికులు, ఉద్యోగులు చిక్కుకున్నారు.