Trending Now

షాద్ నగర్ చౌరస్తాలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం..

ప్రతిపక్షం, షాద్ నగర్: 17 పార్లమెంటు స్థానాల్లో నాలుగు శాతం లేని రెడ్లకు ఆరు సీట్లు కేటాయించి 50% పైగా ఉన్న బీసీలకు రెండు స్థానాలు కేటాయించి 12 శాతానికి పైగా ఉన్న మాదిగలకు స్థానమే లేకుండా చేసిన కాంగ్రెస్ పార్టీ మాదిగల ద్రోహి అని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుదామని ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరసింహ మాదిగ అన్నారు. శుక్రవారం షాద్ నగర్ చౌరస్తాలో ఎమ్మార్పీఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నరసింహ మాదిగ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సీటును కాపాడుకోవడం కోసం మాలలతో కుమ్మక్కై రేవంత్ రెడ్డి ని నమ్మిన మాదిగలరని మోసం చేస్తున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కాదని రెడ్ల, మాలల ప్రభుత్వమని విమర్శించారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానానికి స్థానికేత్రుడై ఉన్న మల్లురవిని కేటాయించడం అన్యాయం అని అన్నారు. మాదిగలను అణగదుకుతున్న ఈ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కిస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి గట్ట గళ్ళ ప్రశాంత్ మాదిగ, ఆనెగళ్ళ ఆనంద్ మాదిగ వినోద్, మాదిగ చెందగల అశోక్, మాదిగ మామిళ్ళపల్లి శ్రీనివాస్, మహేందర్, మాదిగ జంగయ్య, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News