Trending Now

భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ములుగు జిల్లా చ‌త్తీస్‌గఢ్ రాష్ట్రం పూజారి కాంకేర్ స‌రిహ‌ద్దులోని క‌ర్రెగుట్టలో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. శ‌నివారం ములుగు జిల్లా చ‌త్తీస్‌గఢ్ స‌రిహ‌ద్దు ప్రాంత‌మైన కాంకేర్ పూజారి క‌ర్రెగుట్టలో కూంబింగ్ నిర్వహిస్తున్న గ్రేహౌండ్స్‌, ప్రత్యేక పోలీసు బ‌ల‌గాల‌కు మావోయిస్టులు ఎదురుప‌డ‌డంతో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురు కాల్పుల‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వెంకటాపురం మండల పరిధిలోని డోలి, జెల్లా అటవీ ప్రాంతంలో జరిగినట్టు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love

Related News