Trending Now

ఘనంగా బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

ప్రతిపక్షం సిద్దిపేట ఏప్రిల్ 06: భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు గంగాడి మోహన్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. అనంతరం టిఫిన్ బైఠక్ కార్యక్రమంలో పాల్గొని రానున్న పార్లమెంట్ ఎలక్షన్లలో ఎలా ప్రచారం చేయాలో పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మూడోసారి కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టి నరేంద్ర మోడీ ప్రధాని అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ సారథ్యంలో దేశం ప్రపంచ దేశాలకు దీటుగా అన్ని రంగాల్లో రాణిస్తుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ సీటు గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు విద్యాసాగర్, ఉపేందర్ రావు, కానుగంటి శ్రీనివాస్, తొడుపునూరి వెంకటేశం, బైరి శంకర్, కృష్ణ, తాటికొండ శ్రీనివాస్,హేమంత్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News