సింగరేణి అధికారుల పర్యవేక్షణ కరువు..
ప్రతిపక్షం, రామగిరి (మంథని), ఏప్రిల్ 07 : సింగరేణి అధికారుల పర్యవేక్షణ లేమితో వాటర్ ట్యాంక్ నుండి ఆదివారం ఉదయం నుండి త్రాగునీరు వృధాగా పోతోంది. సెంటినరి కాలనీలోని లాధ్నాపుర్ ఆర్&ఆర్ కాలనీ కొరకు నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంక్ పైప్ నుండి అధిక మొత్తంలో నీరు లీకేజీ అవుతున్న పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. వేసవికాలంలో నీటి ఏద్దడితో ప్రజలు నానాఅవస్థలు పడుతున్న తరుణంలో వృధాగా పోతున్న నీటిని చూసిన పలువురు అధికారులు పనితీరు పట్ల పెదవి విరుస్తున్నారు. వాటర్ ట్యాంక్ నుండి అవుతున్న నీరు లీకేజీ పై పర్యవేక్షించాల్సిన అధికారుల బృందం ఆ దిశగా దృష్టి సారించకపోవడం, ఫలితంగా 8గంటల నుండి నీరు వృధాగా పోతుంది. వెంటనే అధికారులు స్పందించి నీటి లీకేజ్ ని ఆపాలని పలువురు కోరుతున్నారు.