ప్రతిపక్షం, మంథని, ఏప్రిల్ 06 : కబ్జా కి గురవుతున్న ప్రభుత్వ భూములను అడ్డుకున్న ఒక మాజీ ప్రజాప్రతినిధికి, ప్రజాప్రతినిది నుండే బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిన పరిస్థితి మంథని లో చోటుచేసుకుంది. మంథని శివారులోని 314 సర్వే నంబర్ లో గల భూమి కబ్జా గురవుతున్న విషయాన్ని జిల్లా ఉన్నదాధికరుల దృష్టికి తీసుకెళ్లినా రామగిరి మండల, జాల్లరం గ్రామ మాజీ సర్పంచ్ జగన్నాథం హరీష్, మంథని మున్సిపాలిటీ కౌన్సిలర్ కర్రు లింగయ్య ఫోన్ కాల్లో తన కుటుంబ సభ్యులకు చంపేస్తామని బెదిరింపులకు గురి చేసాడనీ ఆరోపించాడు. ప్రభుత్వ భూమి, క్రిస్టియన్ సమాధుల భూములు కబ్జా కి గురవుతుండగా అడ్డుకునే ప్రయత్నం చేసిన తనను, తన కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారని, మంథని మున్సిపాలిటీలోనీ కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు కబ్జాకి గురవుతున్న, స్పందించాల్సిన అధికారులు సైతం వత్తాసు పలుకుతూ అనుమతులు మంజూరు చేస్తున్నరానీ, దీనిని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకవెళ్ళే ప్రయత్నం చేసిన నాపై, ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లోకి చేరిన మంథని మున్సిపాలిటీ కౌన్సిలర్ కుర్ర లింగయ్య చంపేస్తానని ఫోన్లో తన కుటుంబసభ్యులను బెరింపులకు గురి చేసాడని మాజీ సర్పంచ్ హరీష్ తెలిపారు. కబ్జాకి గురవుతున్న భుముల పరిరక్షణ కొరకు ప్రయత్నం చేస్తున్న తనను బెదిరింపులకు గురి చేసిన నేపథ్యంలో తన పైన కానీ తన కుటుంబ సభ్యులకు పైన కానీ ఏలాంటి దాడి జరిగిన దానికి పూర్తి బాధ్యత కౌన్సిలర్ కుర్ర లింగయ్య దేననీ పత్రిక పక్రటనలో మాజీ సర్పంచ్ హారిష్ పేర్కొన్నారు.