నిర్మల్ డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు..
నిర్మల్ (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి) ఏప్రిల్ 8 : నిర్మల్ జిల్లా కేంద్రంలో మూడు నియోజకవర్గాల బూతు లెవెల్ ఏజెంట్ల సమావేశం ఏర్పాట్లను నిర్మల్ డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు పరిశీలించారు. ఖానాపూర్ రోడ్డు లోని స్థానిక రెడ్డి ఫంక్షన్ హాల్ పర్యవేక్షించారు. స్థానిక రెడ్డి ఫంక్షన్ హాల్ లో మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వహించే ఈ సమావేశానికి ఏఐసీసీ ఎస్సీ సెల్ జాతీయ అధ్యక్షులు కొప్పుల రాజు, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క , ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్,పీసీసీ ప్రధాన కార్యదర్శి సత్తు మల్లేష్ , ముధోల్ నియోజకవర్గ ఇంచార్జ్ నారాయణ రావు పటేల్, ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి హాజరవుతారని పేర్కొన్నారు. నిర్మల్, ఖానాపూర్, ముధోల్ నియోజకవర్గానికి చెందిన బూత్ ఏజెంట్లు హాజరుకావాలని కోరారు. శ్రీహరి రావు తో పాటు పట్టణ అధ్యక్షులు నందేడపు చిన్ను,16 వార్డ్ కౌన్సిలర్ , తారక రఘువీర్, నగేష్ రెడ్డి, గాజుల రవి కుమార్, పుదరి అరవింద్, అబ్దుల్ హాదీ, తదితరులు ఉన్నారు.