Trending Now

బీదవాని గుండెల్లో దిగులు దులుపే ఉగాది..


 ప్రఖ్యాత చిత్రకారులు రుస్తుం..

ప్రతిపక్షం, సిద్దిపేట ప్రతినిధి ఏప్రిల్ 8: ఉగాది పండుగ ను పురస్కరించుకుని రుస్తుం ఆర్ట్ గ్యాలరీ సిద్దిపేట లో మంగళవారం ‘ఉగాది శ్రీ క్రోధి నామ సంవత్సర’ చిత్రాన్ని అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం ఉగాది చిత్రాన్ని చిత్రించి లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరికి
శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిజేస్తూ, పండుగలు సంస్కృతి సహజీవన శోభనుపెంచి సమాజాలను కళావంతం చేస్తాయి. ప్రకృతి పరవశించి బీదవాని గుండెల్లో దిగులు దులుపే క్రోధి నామ సంవత్సరం “ఉగాది” పర్వదినం’ వికారాలను తరుమ షడ్రుచుల పచ్చడి, నవధాన్యాలను ప్రకృతి ద్వారా మనకు కానుకగా తెచ్చే. పంచాంగ శ్రవణంతో భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసుకొనే విదంగా జాగృత పరుస్తుంది.

“ఆగ మాగమై మూగ బోకు” కోకిల గానం లా దూసుకపో” ఆశయసాధనే ఉగాది మనకు” ప్రపంచ నలువైపులా ఆరోగ్యం శాంతి భద్రతలు ఆనందాలు వెల్లివిరియాలని, కోట్ల గుండెల అమూల్య ఐకమత్య ఖజానా నా తెలంగాణ అస్తిత్వం. తెలంగాణలో అన్ని మతాల ఐకమత్యం, సంస్కృతి సంప్రదాయాలను రక్షిస్తూ.. ప్రజా సంక్షేమ పథకాల అమలు భారతావనికి కనువిప్పు కలగాలని క్రోధి నామ సంవత్సర ఉగాది అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు ఐక్యతకు నాంది పలకాలని మానవతా చిత్రకారులు రుస్తుం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఎ ఎఫ్ అధ్యక్షురాలు జులేఖ రుస్తుం, నైరూప్య చిత్రకారుడు నహీం రుస్తుం, నేచర్ ఆర్టిస్ట్ రూబీనా రుస్తుం, రహీం రుస్తుం, మహ్మద్ సాధిక్ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.

Spread the love

Related News

Latest News