ప్రతిపక్షం, వెబ్ డెస్క్: రాష్ట్రంలోని 1.65 లక్షల క్వింటాళ్ల పొద్దు తిరుగుడు పంటను వెంటనే కొనుగోలు చేయాలని సీఎం రేవంత్‌ను మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. క్వింటా రూ.6,760 ధరతో 25 శాతం పంటనే కొనుగోలు చేయడంతో మిగతా రైతులు నష్టపోతున్నారని తెలిపారు. తాము అధికారంలో ఉండగా చివరి గింజ వరకు కొనుగోలు చేశామని గుర్తు చేశారు.