ప్రతిపక్షం, వెబ్ డెస్క్: సరూర్ నగర్ పట్టణ పరిధిలోని శ్రీ శ్రీ శ్రీ బంగారు మైసమ్మ కాశీ వైద్యనాథ దేవస్థానంలో గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్న నిత్యాన్నదానం కార్యక్రమంలో భాగంగా ఈరోజు సరూర్ నగర్ గోల్డెన్ వాకర్స్ టీం ఆర్యవైశ్య గ్రూపు వారు “‘అమావాస్య ప్రత్యేక భోజనాల””ను 500 మంది భక్తులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి తీగల అనిత హరినాథ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా బంగారు మైసమ్మ అమ్మవారికి.. వైద్యనాథునికి స్పటిక లింగానికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం జరిగిన అన్నదానంలో తీగల అనిత హరినాథ్ రెడ్డి స్వయంగా వడ్డించి 500 మందికి అమావాస్య భోజనాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా తీగల అనిత హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ.. సరూర్ నగర్ పట్టణంలో అనతికారంలోనే బంగారు మైసమ్మ దేవాలయాన్ని భక్తులకు అందుబాటులో తెచ్చే విధంగా స్పటిక లింగం, వైద్యనాథుడు.. గణపతి సుబ్రహ్మణ్యస్వామి, ధన్వంతరి నారాయణడు, ఆంజనేయస్వామి నవగ్రహాలను విగ్రహాలను స్థాపించి ఒక పుణ్య క్షేత్రంగా దేవాలయన్ని తీర్చిదిద్దామన్నారు. ముఖ్యంగా ప్రతిరోజు 200 మందికి, “నిత్యాన్న దానం” పథకాన్ని ప్రతి అమావాస్యనాడు 500 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న దేవాలయం ఫౌండర్ ట్రస్టీలు ఆకుల అరవింద్ కుమార్, బేరా బాలకిషన్(బాలన్న ) లను తీగల అనిత రెడ్డి ప్రత్యేకంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నల్లెంకి ధనరాజ్ గౌడ్, భార్గవ రాజ్ గౌడ్, అరుణ అక్క, రోజా, సరూర్నగర్ గోల్డెన్ వాకర్స్ టీం సభ్యులు నాగేష్ గుప్తా, ప్రభాకర్ గుప్తా, శ్రీనివాస్ గుప్తా, కే ఎస్ గుప్తా, చోలేటి ఆనంద్ గుప్తా, మూర్తి ఉప్పల వెంకటేశం లతో పాటు వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.