ప్రతిపక్షం, సిద్దిపేట ఏప్రిల్ 08: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా కార్యాలయంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, మహాత్మ జ్యోతిరావు, పూలే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మహనీయుల జయంతి ఉత్సవాలను జిల్లాలో విజయవంతంగా చేయాలని ఎమ్మార్పీఎస్ టి ఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల శ్రీనివాస్ మాదిగ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మహనీయులకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా గుర్రాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. మహనీయుల త్యాగాల స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత ఆదర్శంగా ముందుకు వెళ్లాలని పిలుపునిస్తున్నట్లు తెలిపారు. సామాజిక న్యాయం సమానత్వం స్వతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు గడిచినా కానీ చట్టాలను పాలకులు సక్రమంగా అమలు చేయలేకపోవడం వలన నేటికీ కుల వ్యవస్థ అంచివేత అంటరానితనము ఆత్మహత్యలు హత్యలు, దాడులు దళిత గిరిజనుల మీద జరుగుతూనే ఉన్నాయి. వీటిని నిర్మూలించే విధంగా చట్టాలను కఠినంగా అమలు చేయాలని పాలకవర్గాలను డిమాండ్ చేశారు.
నేడు రాష్ట్ర ప్రభుత్వం మహనీయుల జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఎన్నికల కోడ్ ను అడ్డుపెట్టి జరపకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. మహనీయులకు ఎన్నికల కోడ్ అడ్డు రాకూడదని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఎమ్మార్పీఎస్ టీఎస్ కార్యకర్తలు, విద్యార్థులు మహిళలు, యువకులు, ఉద్యోగులు, విద్యార్థులు మేధావులు అందరూ వర్గీకరణ సాధించేవరకు దండోరా పోరాటంలో కలిసి రావాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు లింగాల కృష్ణ, మాదిగ, సిద్దిని రాజ మల్లయ్య మాదిగ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర సహాయ కార్యదర్శి లింగాల బొంబాయి వెంకన్న మాదిగ, రాష్ట్ర ప్రచార కార్యదర్శి బి.ఆర్ తూర్పుంటి రాజేష్ మాదిగ , జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దండు నర్సింలు మాదిగ, దౌల్తాబాద్ సీనియర్ నాయకులు డప్పు శ్రీనివాస్ మాదిగ, ఆకాష్ ,రమేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.