Trending Now

ఇంటి వద్దకే భద్రాచల రాముడి తలంబ్రాలు..

ప్రతిపక్షం, సిద్దిపేట ఏప్రిల్ 08: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని భద్రాచలం దేవాలయంలో ప్రతి ఏటా నిర్వహించే భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి కళ్యాణ మహోత్సవ తలంబ్రాలను ఆర్టీసీ కార్గో సర్వీసు ద్వారా ఇంటి వద్దకే అందజేయడం జరుగుతుందని సిద్దిపేట డిపో మేనేజర్ వై.సుఖేందర్ రెడ్డి తెలిపారు. శ్రీరాముడి అత్యంత పవిత్రమైన మహోన్నతమైన కళ్యాణ మహోత్సవ తలంబ్రాలు కావాలనే భక్తులు కేవలం రూపాయలు 151/- చెల్లిస్తే ఆర్టీసీ కార్గో సర్వీస్ ద్వారా ఇంటి వద్దకే తలంబ్రాలు అందిస్తామని తెలిపారు. ఈ అవకాశం ఈనెల 18 తేదీ వరకు ఉందని పేర్కొన్నారు. సిద్దిపేట డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఎండి షఫీ 9441205434,9154297660, దుబ్బాక 9154298664 చేర్యాల 9885612717 నంబర్లకు సంప్రదించగలరు. కావున శ్రీరాముడి భక్తులు తమ ఇంటి వద్దనే ఉండి శ్రీరాముడి ఆశీస్సులు పొందాలని, ఆర్టీసీ కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ కోరారు.

Spread the love

Related News

Latest News