Trending Now

106 మంది ఉద్యోగులు సస్పెండ్..

జిల్లా ఎన్నికల అధికారి ఎం మనుచౌదరి

ప్రతిపక్షం, సిద్దిపేట ఏప్రిల్ 09: ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించిన ఉద్యోగులపై సిద్దిపేట జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మను చౌదరి సస్పెన్షన్ వేటు వేశారు. సిద్దిపేట పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హల్ లో రెండు రోజుల క్రితం రాత్రివేళ బీఅర్ఎస్ అభ్యర్థి వెంకట్రామ్ రెడ్డి ఏర్పాటు చేసిన మీటింగ్ లో ఐకేపీ, ఈజిస్ ఉద్యోగులు పాల్గొన్నారు. దీంతో ఎన్నికల కొడు ఉల్లంఘించడంతో బీఅర్ఏస్ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి, సుడా మాజీ చైర్మన్ రవీందర్ రెడ్డి పై ఎన్నికల అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిద్దిపేట త్రి టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేసిన అధికారులు, సమావేశంలో పాల్గొన్న 40 మంది ఐకేపీ,66 మంది ఈజిస్ ఉద్యోగులను ఎన్నికల నిబంధన మేరకు వారిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్బంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

Spread the love

Related News