ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో పలువురు నాయకులు బీజేపీలో చేరారు. మాజీ మంత్రి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే పండరి, జడ్పీటీసీ రాజు రాథోడ్, మాజీ జడ్పీటీసీ, ఎంపీటీసీలు, ప్రస్తుత సర్పంచులు, పలువురు నాయకులు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. వారిందరికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.