Trending Now

ఘనంగా వెన్నెల డ్యాన్స్ అకాడమీ ‘జానపద జాతర ఉగాది’ సంబరాలు..

నిర్మల్ (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి) ఏప్రిల్ 9 : శ్రీ క్రోధి నామ నూతన సంవత్సర ఉగాది పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని పురపాలక సంఘం వద్ద వెన్నెల డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ‘జానపద జాతర ఉగాది’ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ హాజరయ్యారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి.. కార్యక్రమాన్ని ప్రారంభించారు. కళాకారులు, ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు, జానపద గేయాలను తిలకించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెన్నెల డ్యాన్స్ అకాడమీ డైరెక్టర్ ధన్ రాజ్ ఆధ్వర్యంలో ప్రతీ ఏటా ఉగాది రోజున సంబరాలు కార్యక్రమం గత నాలుగు సంవత్సరాలు గా నిర్వహిస్తున్నారని, నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఎందరో విద్యార్థులను వెతికి వాళ్లలో ఉన్న ప్రతిభను గుర్తించి, కళాకారులుగా తీర్చిదిద్దుతున్నాడని అన్నారు. ఈ కార్యక్రమంలో.. మాజీ డీసీసీబీ చైర్మన్ కోరిపెల్లి రాంకిషన్ రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు మారుగొండ రాము, మహాలక్ష్మి ఆలయ చైర్మన్ కొడుకుల గంగాధర్, కౌన్సిలర్లు ఎడిపెల్లి నరేందర్, అదుముళ్ళ పద్మాకర్, బిట్లింగ్ నవీన్,అన్వర్ పాషా,భూపతి, పలువురు, ప్రముఖ కళాకారులు తదితరులు ఉన్నారు.

Spread the love

Related News

Latest News