Trending Now

భైంసా ఈద్గాను సందర్శించిన ఎస్పీ..

నిర్మల్ (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి ) ఏప్రిల్ 10 : పవిత్ర రంజాన్ మాసం ముగింపు సందర్భంగా నిర్వహించుకునే ప్రార్థనల కోసం ముందస్తు ఏర్పాట్లలో భాగంగా నిర్మల్ జిల్లా ఎస్పీజి. జానకి నిర్మల భైంసా అదనపు ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తో కలిసి ఈద్గా ను సందర్శించారు. ఈ సందర్భంగా ఈద్గాలో జరుగుతున్న ఏర్పాట్లను ఏఐఎంఐఎం నిర్మల్ జిల్లా అధ్యక్షులు, స్థానిక మున్సిపల్ వైస్ చైర్మన్ జాబీర్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ ఇతర అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈద్గాకు ఎంతమంది ప్రార్థనల కోసం వస్తారు.. ఏ మాదిరి బందోబస్తు ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది అనే దానిమీద ఆమె ఆరా దిశారు. భైంసా పట్టణంతోపాటు ఇతర పరిసర గ్రామాలలో ముస్లింలు ఈద్-ఉల్-ఫితర్ ప్రార్ధనలు నిర్వహించే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ముందస్తు బందోబస్తు ఏర్పాట్లను చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టాలని ఆమె ఈ సందర్భంగా ఆదేశించారు. భైంసా పట్టణ ఎంఐఎం అధ్యక్షులు ఫైజుల్లాఖాన్ కో-ఆప్షన్స్ సభ్యులు ఇంతియాజ్ అహ్మద్, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, నాయకుల స్థానికులు ఉన్నారు.

Spread the love

Related News

Latest News