ప్రతిపక్షం, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై.. ధ్రువపత్రాని అందుకున్న అనిల్ కుమార్ యాదవ్ .. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వారి ఆశిర్వాదం తీసుకున్నారు. చిన్నవయస్సులో పెద్దల సభకు వెళ్లే అవకాశం కల్పించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కాగా, అనిల్ కుమార్ యాదవ్ గతంలో ముషీరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు.