ప్రతిపక్షం, సిద్దిపేట ఏప్రిల్ 11: రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీ సోదరులందరికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేటలోని ఇక్బాల్ మినార్ మసీద్ వద్ద జరిగిన రంజాన్ పండుగ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతికి, ప్రేమకు, పవిత్ర సంకల్పానికి చిహ్నం రంజాన్ పండగ అన్నారు. నెల రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు ఉండి, ఇంతటి ఓపికతో ఉపవాసాలు చేసిన మీ అందరికీ అల్లా ఆశీర్వాదం ఉంటుందన్నారు.
మీ జీవిత అశయాలు నెరవేరేలా అల్లా ఆశీర్వదించాలని మనసారా కోరారు. మీ ప్రార్థనలు సమాజ శ్రేయస్సుకు దోహదపడతాయన్నారు. 20 ఏండ్లుగా సిద్దిపేటలో రంజాన్ పర్వదినాన ముస్లిం సోదరులకు అలాయ్ బలాయ్ చేసుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోందని తెలిపారు. ఈ రోజు కూడా సిద్దిపేట ముస్లిం సోదరులను కలిసి పండగలో పాలుపంచుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించారు.