Trending Now

సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిబా ఫూలే..

ప్రతిపక్షం, సిద్దిపేట ఏప్రిల్ 11: ప్రపంచ గతిని మార్చే శక్తి ఒక్క విద్య వల్లనే సాధ్యమని నమ్మి ఆ కాలంలో వున్న సామాజిక,కుల, లింగ వివక్షతలను పారద్రోలడానికి అహర్నిశలు పోరాడిన సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిబా ఫూలే అని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాసు అన్నారు. గురువారం 198 వ జయంతి సందర్భంగా సిద్దిపేటలోని పాత బస్టాండ్ వద్ద గల ఫూలే విగ్రహ మూర్తికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యంగా మహిళలకు చదువును అందించడం కోసం, అసమానతలు తొలగించడం కోసం, రైతుల బాగు కోసం ఎన్నో అవమానాలను సహించి పేరుకు పోయిన పెత్తందారీ వ్యవస్థలపై అహర్నిశలు పాటు పడ్డారని ఆ త్యాగమూర్తి దార్శనికత వల్లనే ఈ నాడు ఫలితాలు అనుభవిస్తున్నమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కాజీపేట సత్యనారాయణ, బాల్ నర్సయ్య, రాజేంద్రప్రసాద్ భట్, శ్రీరామ్ సురేషు, బాలమల్లు, యాదగిరి, రాజు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News