Trending Now

ఆధ్యాత్మిక జీవనం గొప్ప విషయం..

ప్రతిపక్షం, నకిరేకల్, ఏప్రిల్ 11: రంజాన్ పండుగ సందర్భంగా ఎంతో నిష్టతో ముస్లిం సోదర సోదరీమణులు కఠోర ఉపవాస దీక్షతో ఆధ్యాత్మిక జీవనం కొనసాగించడం గొప్ప విషయమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో మసీదు వద్ద ఆయన ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఆయన వెంట టిడిపి సిసి మేనిఫెస్టో నెంబర్ చామల శ్రీనివాస్, కౌన్సిలర్లు, నాయకులు, ప్రజాప్రతినిధులు, ముస్లిం మైనారిటీ నాయకులు ఉన్నారు.

చిట్యాలలో.. రంజాన్ పండుగ సందర్భంగా చిట్యాల పట్టణంలో ఈద్గా వద్ద ముస్లిం సోదరులు గురువారం ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. మునిసిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి కౌన్సిలర్లు వారికి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పోకల దేవదాసు, బోడ స్వామి, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్టా నగేష్ అవిశెట్టి శంకరయ్య, శీలా రాజయ్య, నారబోయిన శ్రీనివాస్ ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మండలంలోని వెలిమినేడులో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అంతటి పారిజాత, నరసింహ, ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

Spread the love

Related News

Latest News