ప్రతిపక్షం, గజ్వేల్ ఏప్రిల్ 11: మహాత్మా జ్యోతిరావు ఫూలే 198 వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నివాళుర్పించారు. అనంతరం సమరసతా వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుల నరేశ్ బాబు మాట్లాడుతూ.. ఫూలే అణగారిన వర్గాలకు అక్షర జ్యోతిగా వెలుగుతూ అంటరాని తనంపై, కుల వివక్షతపై , స్త్రీ వివక్షతలపై పోరాటం చేసారన్నారు. సత్య శోధన సమాజం ఏర్పాటు చేసి దేవుని దృష్టిలో అందరూ సమానమేనని.. వివక్షతలన్ని స్వార్థంతో మనుషులు సృష్టించుకున్నవే అని నిరూపించిన మహానుభావుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో TPUS జిల్లా సంఘటనా కార్యదర్శి కొండపర్తి భాస్కరా చారి, సమరసతా వేదిక ఖండ కార్యదర్శి దొంతి రమేష్, బాసెట్టి విష్ణు, కడారీ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.