సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుభాష్ చంద్రబోస్ డిమాండ్..
ప్రతిపక్షం, వెబ్డెస్క్: ఎండిపోయిన పంటలకు.. నష్టపోయిన రైతులకు ఎకరానికి 30 వేల రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రముఖ సామాజిక ప్రజా సేవకులు, సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, రాష్ట్ర గవర్నర్ గారిచే రాష్ట్రస్థాయి సిల్వర్ గోల్డ్ అవార్డు గ్రహీత వలస సుభాష్ చంద్రబోస్ కోరారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శ్రీరాముల పేట గ్రామానికి బండి సురేష్ రైతు నష్టపోయిన వరిని ఇవాళ ఆయన సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎకరానికి రూ. 30,000 రైతులకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఎండిపోయిన రైతుల పొలాల వద్దకు వెళ్లి వారికి రాష్ట్ర ప్రభుత్వం నుండి భరోసా కల్పించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఆయన వెంట నష్టపోయిన రైతు బండి సురేష్, స్వశక్తి భవన కార్మిక సంఘం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బోయిన చంద్రయ్య, రైతు సురేందర్ రెడ్డి గజ్జల సదానందం, రైతులు, తదితరులు పాల్గొన్నారు.