Trending Now

భక్తుల వద్దకే భద్రాచలం తలంబ్రాలు..

ప్రతిపక్షం, హుస్నాబాద్, ఏప్రిల్ 12: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ డిపోలో మీ ఇంటి వద్దకే కేవలం రూ.151/- చెల్లింపుతో భద్రాద్రి శ్రీ సీతారామ చంద్రుల వారి కళ్యాణ తలంబ్రాలు అందుకునే అవకాశం హుస్నాబాద్ పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు హుస్నాబాద్ ఆర్ టీ సి అందిస్తుందని హుస్నాబాద్ డిపో మేనేజర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాముల వారి ఈ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. భద్రాచలం సీతారాముల కళ్యాణోత్సవ తలంబ్రాలను భక్తులు పవిత్రంగా భావిస్తారని అక్కడికి వెళ్లలేని భక్తులకు ఇంటి వద్దే అందించేందుకు ఆర్టీసీ లాజిస్టిక్స్‌ సెంటర్లలో బుకింగ్స్‌ ప్రారంభించామని, బుకింగ్స్‌ చేసుకున్న వారికి సీతారాముల కళ్యాణం అనంతరం వారి ఇంటి వద్దకే పంపించడం జరుగుతుందన్నారు. బుకింగ్స్‌ చేసుకునే భక్తులు తమ ఇంటి చిరునామాతో పాటు ఫోన్‌ నెంబర్‌ ఇవ్వాలని సీతారాముల కళ్యాణ తలంబ్రాల పంపిణీని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

భద్రాద్రిలో ఈ నెల 17న అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామనవమి వేడుకలకు వెళ్లలేని హుస్నాబాద్ పరిసర ప్రాంతాల భక్తులు ఈ సేవల్ని వినియోగించుకోవాలని టీఎస్ఆర్టీసీ హుస్నాబాద్ అధికారులు కోరారు. రాష్ట్రంలోని అన్ని టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో తలంబ్రాలను బుక్‌ చేసుకోవచ్చని చెప్పారు. సంస్థ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌లు కూడా భక్తుల వద్ద నేరుగా ఆర్డర్లను స్వీకరిస్తారని తెలిపారు.

తలంబ్రాల సేవను పొందాలనుకునే హుస్నాబాద్ పరిసర ప్రాంతాల భక్తులు తెలంగాణ స్టేట్ ఆర్టీసీ బుకింగ్ సెంటర్ ఫోన్‌ నంబర్లైన 9154298673, 9154298671ను సంప్రదించాలని సూచించారు. ఆర్టీసీ లాజిస్టిక్‌ సేవల ద్వారా గతం కంటే ఈ సారి ఎక్కువ మందికి తలంబ్రాలు అందజేయాలని ఏర్పాట్లు చేస్తున్నది. కావాల్సిన వారు రూ.151 చెల్లించి సిద్దిపేట జిల్లాలోని అన్ని లాజిస్టిక్‌ సెంటర్లలో ఈ నెల 18 వరకు ముందస్తు బుకింగ్స్‌ చేసుకోవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

Spread the love

Related News

Latest News