ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: IPL-2024లో భాగంగా ఇవాళ పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. చండీగఢ్‌లోని ముల్లన్పూర్ వేదికగా రాత్రి 7:30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది. టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు ఈ రెండు జట్లు 26 మ్యాచుల్లో తలపడగా RR 15 విజయాలు సాధించింది. PBKS 11 మ్యాచుల్లో గెలిచింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాజస్థాన్ 8 పాయింట్లతో టాప్‌లో ఉండగా, పంజాబ్ 4 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది.
లక్నోకు షాక్.. ఢిల్లీ గ్రాండ్ విక్టరీ..
IPL-2024లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో నిన్న జరిగిన మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. 168 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో ఛేదించింది. DC బ్యాటర్లలో మెక్‌గర్క్ 55, పంత్ 41, పృథ్వీ షా 32 రన్స్‌తో రాణించారు. ఈ సీజన్లో ఢిల్లీకి ఇది రెండో విజయం కాగా, లక్నోకు రెండో ఓటమి.