Trending Now

తెలంగాణలో 12 ఎంపీ సీట్లను గెలవడమే లక్ష్యం..

బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

నిర్మల్ (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి ) ఏప్రిల్, 13 : తెలంగాణలో 12 ఎంపీ సీట్లను గెలవడమే లక్ష్యంగా భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తున్నామని బీజేఎల్పి నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఐదు నియోజకవర్గాల విస్తృత స్థాయి, కార్యకర్తల భూత్ స్థాయి సమావేశంలో ఆయన ఈ సందర్భంగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పదేళ్ల పాలనలో అమలు చేసినా వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ప్రతి తలుపును తట్టి వారు ఖచ్చితంగా బీజేపీకి ఓటు వేసేలా అవగాహన కల్పించేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు.

పదేళ్ల నరేంద్ర మోడీ పాలనలో ‘సబ్ కా సాత్ కా వికాస్’ నినాదంతో అన్ని వర్గాలకు సమాన్వయం చేస్తూ దేశంలోని ఎన్డీఏ ప్రభుత్వం కోట్లాది రూపాయలు రచించి అన్ని వర్గాలను ఆదుకునేలా ముందుకెళ్లిందని చెప్పారు. అప్పి బార్ మోడీ సర్కార్.. ఏక్ బార్ చార్ సౌ కి సర్కార్ నినాదంతో ముందుకు వెళ్తామని చెప్పారు. మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్చార్జ్ మురళీధర్ రావు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా కాశయ్య జెండాలే ఎగిరేలా అన్ని రాష్ట్రాలను బీజేపీకి అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తుందని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో కూడా పెద్ద మొత్తంలో భారతీయ జనతా పార్టీ సీట్లు గెలుచుకునే అవకాశాలు లేకపోలేవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో 10 నుంచి 12 ఎంపీ సీట్లు బీజేపీ ఇప్పటికే గెల్చుకుందన్నా విషయాన్ని గుర్తించాలన్నారు. ఈ విస్తృత స్థాయి సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచార అస్త్రాలను విడుదల చేయగా.. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, భైంసా ఎమ్మెల్యే రామారావు పటేల్, బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ అయ్యాన్న గారి భూమయ్య, పెద్దపల్లి ఇన్చార్జ్ రావుల రాంనాథ్ తదితరులు ఉన్నారు.

Spread the love

Related News

Latest News