Trending Now

కాంగ్రెస్ 14 సీట్లు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పు కుంటా

లేకకపోతే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా?

బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి సవాల్

భూముల కబ్జాలు, సెటిల్మెంట్ల కోసమే రేవంత్ సీఎం అయ్యారు

తెలంగాణలో భవిష్యత్ బీజేపీదే


నిర్మల్, ప్రతిపక్షం ప్రతినిధి, ఏప్రిల్13 :
బీజేఎల్ పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ 14 ఎంపీ సీట్లను గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. తెలంగాణలో బీజేపీ 10 సీట్లు గెలిచి తీరుతుందని అన్నారు. శనివారం ఆదిలాబాద్ లో నిర్వహించిన అదిలాబాద్ పార్లమెంట్ బీజేపీ నియోజకవర్గ బూత్ స్థాయి ఎన్నికల సమావేశంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో తెలంగాణను ఏలే శక్తి సామర్థ్యాలు బీజేపీకే ఉన్నాయన్న విషయాన్ని గుర్తించాలన్నారు. కాంగ్రెస్ 14 ఎంపీ సీట్లు గెలిస్తే తాను రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటానని, అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తారా..? అని ప్రశ్నించారు. భూములు ఆక్రమణదారులను కాపాడేందుకే రేవంత్ సీఎం అయ్యారని తీవ్రంగా మండిపడ్డారు. ఈ సమావేశంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జి మురళీధర్ రావు, ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్ , రామారావు పటేల్, పాల్వాయి హరీష్ బాబు, అదిలాబాద్ పార్లమెంటరీ కన్వీనర్, సీనియర్ నాయకుడు అయ్యన్న గారి భూమయ్య, బీజేపీ పెద్దపెల్లి ఇంచార్జి రావుల రాంనాథ్ నిర్మల్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అంజు కుమార్ రెడ్డి, సామ రాజేశ్వర్ రెడ్డి, మెడిసిమ్మ రాజులతో పాటు ఆయా జిల్లాల మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News