ప్రతిపక్షం, తెలంగాణ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. రాయ్ బరేలీ స్థానం నుంచి 6 సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన సోనియా తొలిసారి రాజ్యసభలో ఎంట్రీతో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. రాజ్యసభకు సోనియా గాంధీ ఎన్నికవడం పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘తల్లిగా అమరుల త్యాగాలకు తల్లడిల్లి… నాయకురాలిగా స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చి తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన శ్రీమతి సోనియాగాంధీ గారు రాజ్యసభకు ఎన్నిక కావడం సంతోషకరం. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరపున సోనియమ్మకు హృదయపూర్వక శుభాకాంక్షలు.’ అని ట్వీట్ చేశారు.
తల్లిగా అమరుల త్యాగాలకు తల్లడిల్లి… నాయకురాలిగా స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చి… తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన శ్రీమతి సోనియాగాంధీ గారు రాజ్యసభకు ఎన్నిక కావడం సంతోషకరం.
— Revanth Reddy (@revanth_anumula) February 21, 2024
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరపున సోనియమ్మకు హృదయపూర్వక శుభాకాంక్షలు.#SoniaGandhi… pic.twitter.com/cJw9o2VXfK