ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: IPLలో ఇవాళ ఆసక్తికర పోరు జరగనుంది. బెంగళూరు వేదికగా SRH, RCB మధ్య రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటివరకు 5 మ్యాచులాడి మూడింట గెలిచిన SRH.. మరో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. మరోవైపు ఆడిన 6 మ్యాచుల్లో ఒకే ఒక్కటి గెలిచి టేబుల్‌లో చిట్టచివరి స్థానంలో ఉన్న RCB.. ఇవాళ ఎలాగైనా SRHపై నెగ్గాలని భావిస్తోంది.
ఉత్కంఠ పోరులో చెన్నై విజయం..
వాంఖడే స్టేడియంలో చెన్నైతో నిన్న జరిగిన ఉత్కంఠ పోరులో ముంబై 20 పరుగుల తేడాతో ఓటమి చెందింది. రోహిత్ శర్మ సెంచరీ (63 బంతుల్లో 105 రన్స్) బాదినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇషాన్ కిషన్ 23, తిలక్ వర్మ 31 రన్స్ చేయగా.. సూర్యకుమార్ (0), పాండ్యా (2) నిరాశపర్చారు. చెన్నై బౌలర్లలో పతిరణ నాలుగు వికెట్లతో చెలరేగారు. తుషార్, ముస్తాఫిజుర్ చెరో వికెట్ తీశారు.