ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఇటీవల దాడి నేపథ్యంలో CM జగన్ భద్రతలో మార్పులు, చేర్పులు చేశారు. ప్రస్తుత భద్రతకు అదనంగా సెక్యూరిటీని ఏర్పాటు చేయగా.. బస్సు యాత్ర మార్గాల్లో DSPలతో భద్రత కల్పిస్తారు. CM రూట్ మార్గాలను సెక్టార్లుగా విభజించి.. సెక్టార్‌కు ఒక DSP, ఇద్దరు CIలు, నలుగురు SIలు సెక్యూరిటీ కల్పిస్తారు. ఇకపై నిర్దేశించిన ప్రాంతాల్లోనే CM రోడ్‌షోలు, సభలు ఉండనుండగా.. గజమాలలు, పువ్వులు విసరడంపై ఆంక్షలు అమల్లో ఉంటాయి.
కృష్ణా జిల్లా సిద్ధమా..? : జగన్
విజయవాడలో రాయి దాడి నేపథ్యంలో సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు నిన్న బ్రేక్ పడగా.. ఈరోజు మళ్లీ ప్రారంభం కానుంది. ఒక్క రోజు విరామం తర్వాత సీఎం జగన్ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. ఈ మేరకు యాత్రను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ‘కృష్ణా జిల్లా సిద్ధమా..?’ అని పేర్కొన్నారు. గన్నవరం, ఆత్కూర్, వీరవల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్, పుట్టగుంట, జొన్నపాడు వరకు యాత్ర సాగనుంది. కేసరపల్లి నుంచి ఉదయం 9 గంటలకు ప్రారంభమై గన్నవరం, ఆత్కూర్, వీరవల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్ మీదుగా జగన్ జొన్నపాడు చేరుకుంటారు. అక్కడ భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు గుడివాడ చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు.