ప్రతిపక్షం, కరీంనగర్: కరీంనగర్ ఆదర్శనగర్ అగ్ని ప్రమాద ఘటన స్థలాన్ని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదం తీవ్ర స్థాయిలో జరిగింది. ఈ ఘటన లో నష్టపోయిన వారంతా నిరుపేదలే.. అందరూ రోజువారి కూలీలు. సమ్మక్క జాతరకు మేడారం పోయినందువల్ల ప్రాణ నష్టం జరగలేదు.. వారిని భగవంతుడే కాపాడారు అని పొన్నం ప్రభాకర్ అన్నారు. వారిని ప్రభుత్వం తరుపున ఆదుకుంటామని.. భోజనం, తాత్కాలిక నివాసం ఏర్పాట్లు చేశామన్నారు. రాజీవ్ గృహ కల్ప, ఇందిరమ్మ ఇండ్ల లో అవకాశం ఉన్నచోట నివాస సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
నష్టపోయిన 17 కుటుంబాలకు మాజీ కార్పొరేటర్ నడిపెల్లి అశోకరావు తన వంతు సహాయంగా.. ఒక్కో కుటుంబానికి 5 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి, నరేందర్ రెడ్డి, కార్పొరేటర్ మేచినేని అశోక్ రావు, స్థానిక నాయకులు నడిపెల్లి అశోక్ రావు, ఆకారపు భాస్కర్ రెడ్డి, కుర్రపోచయ్య, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, దండి రవీందర్, బసవరాజు శంకర్, మహమ్మద్ అమేర్ తదితరులు పాల్గొన్నారు.