ప్రతిపక్షం, ఏపీ: టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు కోసం చాలా కష్టపడ్డానని పవన్ కళ్యాన్ తెలిపారు. ”జాతీయ నాయకత్వంతో ఎన్ని చీవాట్లు తాన్నానో నాకే తెలుసు. వారిని ఒప్పించడానికి నానా మాటలు పడ్డాను. రెండు చేతులు జోడించి, దండం పెట్టి అడిగాను. నేనెప్పుడూ నా కోసం అడగలేదు. రాష్ట్ర భవిష్యతు కోసం అడిగాను.. తిట్టిన భరించాను” అని పవన్ వెల్లడించాను.
టీడీపీ-జనసేన-బీజేపీలను ఏ శక్తి ఆపలేదని.. జనసేన ఒక్కటే ఉన్నప్పుడు ఏం చేయలేకపోయారు.. మూడు పార్టీలను ఏం చేస్తారు.. మనం గెలుస్తున్నాం.. ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం.. 151 మంది ఎమ్మెల్యేలు ఉండి ఏం చేయలేకపోయారు.. ఇప్పుడేం చేస్తారు.. వైసీపీ ఓడిపోయే పార్టీ అని పవన్ కల్యాణ్ కీలక కామెంట్స్ చేశారు.