Trending Now

నీతి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు అవసరం..

నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్..

నిర్మల్ (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి) ఏప్రిల్ 15 : పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో త్రాగు, సాగు నీటి అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలకు త్రాగునిటీ ఇబ్బందులు రానీయకుండా అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. ఊష్ణగ్రతలు పెరగడం వల్ల వచ్చే రెండు నెలలు కీలకం’ అని అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ.. తాగునీటి సరఫరా ప్రక్రియలో అంతరాయం కలగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.

తాగునీటి కొరతపై వచ్చే ఫిర్యాదులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని సూచించారు. నిర్మల్, బైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీలలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీటిని సరఫరా చేయాలని, పైప్ లైన్, చేతిపంపు లకు అవసరమైన మారమ్మత్తులు చేపట్టి నీటిని అందించాలని అన్నారు. అలాగే హరితహారం లో భాగంగా నాటిన మొక్కలు చనిపోకుండా నిరంతరం నిరందించాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రత కు అధిక ప్రాధాన్యతనివ్వాలని నిరంతరం పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఎండా కాలాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని రిజర్వాయర్ల నీటిని అవసరాలకు అనుగుణంగా వినియోగించాలని, రైతులకు సాగు నీటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు.

పంటల అవసరాలను అంచనా వేసి నీటిని విడుదల చేయాలని సూచించారు. నీటి వృధాను అరిట్టేలా కాల్వలకు మరమ్మత్తులు చేపట్టాలని ఆదేశించారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి ప్రజలకు త్రాగునీరు, సాగునీరు కు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో నీటి పారుదల శాఖ ఎస్ఈ సుశీల్ కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్, మిషన్ భగీరథ డీ.ఈ సందీప్, నిర్మల్, ఖానాపూర్, భైంసా మున్సిపల్ కమిషనర్లు సివిఎన్ రాజు, మనోహర్, వెంకటేశ్వర్ రావ్, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News