మంగళవారం నిర్మల్ లో అల్లోల అభిమానులతో అత్యవసర సమావేశం ..!
ప్రతిపక్షం ప్రతినిధి, నిర్మల్, ఏప్రిల్ ,15 : మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ లో చేరికకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లు విశ్వాసనీయ సమాచారం. అల్లోల ను కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు ఇప్పటికే ప్రస్తుత రాష్ట్ర మంత్రి, మాజీ మంత్రులు ఇద్దరు ఇప్పటికే పలుమార్లు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ కార్గే ,రాహుల్ గాంధీలతోనే నేరుగా రహస్యంగా పలుమార్లు మంతనాలు జరిపియారని అధిష్టానం నుంచి కూడా అల్లోలను చేర్చుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. లోకసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచి పట్టు ఉన్న మాజీ మంత్రి సీనియర్ నాయకులు అన్న ఇంద్రకరణ్ రెడ్డి ని చేర్చుకుంటే కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థి గెలుపు సులభంగా జరిగే అవకాశాలు ఉంటాయని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు చెబుతున్నారు. ముందస్తు సమాచారం మేరకే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్మల్ నియోజకవర్గం తో పాటు జిల్లాలోని పలు మండల,పట్టణ స్థాయి ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు,బీఆర్ఎస్ ఆయా విభాగాల పదాధికారులు నాయకులను నాయకులను స్వయాన తానే సోమవారం కండువాలు వేసి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. సుమారు నెలన్నర రోజులుగా రాష్ట్ర మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ లో చేరికను అడుగడుగునా అడ్డుకుంటూ.. తీవ్రంగా నిరసనలు ఆందోళనలు చేసిన వారిని ఒప్పించే బాధ్యతను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైనే జాతీయ స్థాయి అధిష్టానం మోపినట్లు తెలుస్తుంది. ఇప్పటికే అల్లోల వర్గీయులు 90శాత వరకు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. నిర్మల్ పురపాలక సంఘంలో ఉన్న కొంతమంది కౌన్సిలర్లు, పట్టణ జిల్లా స్థాయి నాయకులు, సారంగాపూర్, దిలావర్ పూర్, నర్సాపూర్ (జి),మామడ, లక్ష్మణ చాంద,సోన్ మండలాలకు చెందిన చాలామంది ఇప్పటికీ బీఆర్ఎస్ ను వీడకుండా అల్లోల కాంగ్రెస్ లో చేరికను ఎదురుచూస్తూ ఉండిపోయారు. అల్లోల సమావేశానికి వెళ్లకుండా బీఆర్ఎస్ ఎత్తుగడ*రాష్ట్ర మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వర్గీయుల అత్యవసర సమావేశము మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్నట్లు సంబంధిత అభిమానులు శ్రేణులకు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఫోన్ ల ద్వారా సమాచారం అందిస్తుండడానికి గమనించిన నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ నాయకులు అప్రమత్తమయ్యారు. నిర్మల్ పట్టణ ఆయా మండలాల నుండి బీఆర్ఎస్ సంబంధిత ప్రజా ప్రతినిధులు,మాజీ ప్రజా ప్రతినిధులు,ఆయా విభాగాల పదాధికారులు,కార్యకర్తలు ఎవరు కూడా అల్లోల సమావేశానికి వెళ్లకుండా ఉండేందుకు అదిలాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నట్లు ఈ సమావేశానికి రావాలంటూ తిరిగి ఫోన్ కాల్స్ చేస్తూ.. వెళ్లేందుకు ఖర్చులు అన్నింటినీ తాము చూసుకుంటామంటూ ముందస్తు భరోసాలు కల్పిస్తున్నట్లు సమాచారం.