నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విపతి పత్రం సమర్పించిన దళిత సంఘాలు
నిర్మల్ (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి) ఏప్రిల్ 16 : నిర్మల్ పట్టణ కేంద్రంలోని దివ్య నగర్ అయ్యప్ప టెంపుల్ ముందర గల ప్రభుత్వ భూమిలో అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని కోరుతూ మంగళవారం నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దళిత సంఘాలు, ఇతర యువజన సంఘాల నాయకులు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దివ్య నగర్ అయ్యప్ప టెంపుల్ ముందర ఉన్న ప్రభుత్వ భూమిని కొంతమంది ఆక్రమించుకొని తమదైన రాజ్యాన్ని చెలాయిస్తున్నారని వారు ఈ సందర్భంగా ఆరోపించారు.
ప్రభుత్వ భూమి అధికారిక అర్హత పత్రాల ఆధారంగా పూర్తిస్థాయిలో గుర్తించి హద్దులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రపంచ మేధావి డా.భీంరావు రాంజీ అంబేద్కర్ పేర అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమం లో బత్తుల రంజిత్, కొంతం గణేష్, కత్తి నవీన్, రవి, అరుణ్, సిద్ధార్థ, తదితరులు పాల్గొన్నారు.