మతి భ్రమించినా పుట్ట మధుకర్..
అత్యుత్సాహంతో మాట్లాడి ఉన్న విలువను పోగొట్టుకోకు..
హితవు పలికిన రామగిరి మండల కాంగ్రెస్ నాయకులు
ప్రతిపక్షం, రామగిరి(మంథని), ఏప్రిల్ 16 : అధికారం కోల్పోగానే, మతి భ్రమించిన పుట్ట మధుకర్ ఇస్టారీతిన మాట్లాడి ఉన్న విలువను తనకు తానే మంట కలుపుకుంటున్నాడని నాయకులు ఎద్దేవా చేశారు. గడిచిన బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జెడ్పీచైర్మన్ గా పుట్ట మధు ఉన్న సమయంలోనే అధిక లోడ్ తో నడిచిన ఇసుక లారీలతో ధ్వంసమైన రహదారులను నేటి కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో జరిగినట్టు చూపించి మాట్లాడటం చూస్తుంటే పుట్ట మధుకు నిజంగానే మతి భ్రమించిదేమో అనిపిస్తుందన్నారు. రామగిరి మండలంలోని లాధ్నాపూర్ గ్రామంలో మంగళవారం కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు తోట చంద్రయ్య అధ్యక్షతన మండల కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికారంలో ఉన్నన్ని రోజులు ఏనాడు ఇసుక లారీల వల్ల జరిగిన నష్టాలపై, పోయిన ప్రాణాలపై జరిగిన ప్రమాదాలపై పెదవి విప్పని పుట్ట మధు.. కాంగ్రెస్ ప్రజా పాలనను ఓర్వ లేక పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డిపాజిట్ ఓట్ల కొరకు మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పై అక్కసు వెళ్ళగకుతున్నారని దుయ్యబట్టారు.
మతి భ్రమించి మాట్లాడిన పుట్ట మధు అసత్యపు వ్యాఖ్యలకు సాక్ష్యంగా నిలిచిన రహదారికి వినతిపత్రం అందజేశారు. రహదారి ఎప్పుడు ధ్వంసం అయిందో మీ పార్టీ నాయకులనైన అడిగి తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంథని అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బర్ల శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆరేళ్ళీ కొమురయ్య గౌడ్, బీవీ స్వామి గౌడ్, మాజీ ఎంపీటీసీ ముస్త్యల శ్రీనివాస్, కొరకొప్పుల తులసీ రాం, కాటం సత్యం, గ్రామ శాఖ అధ్యక్షుడు తోగరి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.