ప్రతిపక్షం, సిద్దిపేట ఏప్రిల్ 16: శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ప్రజలందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీరామ నవమి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. “హక్కుల కంటే బాధ్యత గొప్పదన్నది రామతత్వం! కష్టంలో కలిసి నడవాలన్నది సీతాతత్వం.” శ్రీరాముడు కష్టాల్లో మనో నిబ్బరం కోల్పోకుండా ముందుకు సాగి విజయం సాధించారు అని శ్రీరామున్నిఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకు నడవాలన్నారు. మానవ అవతారమూర్తులైన సీతారాములు ధర్మసంస్థాపనకు నిలువుటద్దంగా నిలిచారని స్పష్టంచేశారు. శ్రీరాముని అనుగ్రహముతో అన్నిరంగాల్లో పురోభివృద్ధిని సాదించాలని ఈ యేడు వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు ఆనందంతో పాడి పంటలతో వర్ధిల్లాలని భగవంతున్నీ ప్రార్ధిస్తున్నానాని అన్నారు. శ్రీ సీతా రామచంద్ర స్వామి కళ్యాణోత్సవాన్ని వేడుకగా జరుపుకోవాలని ప్రజలందరు ఆనందోత్సాహాల మధ్య సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.