కిటికీ అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం..
ప్రతిపక్షం, సిద్దిపేట ఏప్రిల్ 16: విద్య విధానానికి శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం తూట్లు పొడుస్తున్నదని ఆరోపిస్తూ.. సిద్దిపేట పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాల రెండవ బ్రాంచ్ పై ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు దాడి చేశారు. ఈ దాడిలో స్కూల్ లోని ఫర్నిచర్ ను, కిటికీ గ్లాసులను ధ్వంసం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. తొమ్మిదవ తరగతి విద్యార్థులకు ఫైనల్ పరీక్షలు పూర్తి కాకుండానే అడ్వాన్స్ గా 10 వ తరగతి సిలబస్ పరీక్షలు రాపిస్తున్నందుకు శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం తీరుకు నిరసనగా ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు పాఠశాలపై దాడి చేసినట్లు తెలిపారు. శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం స్వంత విద్య విధానం పాటిస్తున్నారని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. స్కూల్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఏబీవీపీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు.