అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తుల రంజిత్ కుమార్ డిమాండ్..
నిర్మల్ (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి) ఏప్రిల్ 17 : నిర్మల్ జిల్లా కేంద్రంలోని బాసర ట్రిపుల్ ఐటీ లో వరుసగా జరుగుతున్న ఆత్మ హత్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలని అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తుల రంజిత్ కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి వెంటనే బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించి అక్కడ ఉన్న విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని.. విద్యార్థుల ఆత్మహత్యలకు కారకులైన వారిని గుర్తించి, సిట్టింగ్ జడ్జీ తో విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరణించిన విద్యార్థి అరవింద్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
నిర్మల్ బాసర ట్రిపుల్ ఐటీ ఆర్జీకేయుటీ లో నిన్న మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అరవింద్ కుమార్ అనే విద్యార్థి వసతి గృహంలోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.