నిర్మల్ (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి) ఏప్రిల్ 17 : నిర్మల్ జిల్లాసారంగాపూర్ మండలం జాం గ్రామంలో శ్రీ రామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణమహోత్సవంలో నిర్మల్ ఎమ్మెల్యే బీజేఎల్పి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడెం నగేష్ లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాంప్రదాయ పద్ధతులలో జడ కొప్పులాటలు ఆడారు భక్తులను ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీజేపీ పదేళ్ల పాలనలోనే హిందువులందరికీ సరైన న్యాయం జరిగి సనాతన ధర్మ పరిరక్షణ కొనసాగుతున్నదని చెప్పారు. రామాలయ నిర్మాణం కోసం 500 సంవత్సరాలు వేచి చూసిన భారతీయులకు శోభయామానంగా రామాలయం నిర్మించి ఇచ్చిన ఘనత బీజేపీ కే దక్కుతుందని పేర్కొన్నారు. హిందూ సనాతన ధర్మ విలువలకు అనుగుణంగా ప్రతి హిందూ ముందుకెళ్తే భవిష్యత్తు బంగారు బాట పడుతుందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.