ప్రతిపక్షం, నేషనల్: దేశవ్యాప్తంగా ఆధార్ కార్డుకు ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతీ సామాన్యుడికి గుర్తింపు కార్డుగా మారిపోయింది. బ్యాంకు ఖాతా నుండి మొబైల్ సిమ్ కార్డ్ వరకు ఇలా నిత్యం ఎన్నో అవసరాలకు ఆధార్ కార్డ్ తప్పనిసరైపోయింది. యూఐడీఏఐ జారీ చేస్తున్న ఆధార్ కార్డుల్లో బ్లూ ఆధార్ కార్డ్ గురించి తెలుసా..?
UIDAI పిల్లల కోసం ప్రత్యేకంగా నీలి రంగులో ఉండే ఆధార్ కార్డులను జారీ చేస్తుంది. సాధారణ ఆధార్ కార్డ్‌తో పోలిస్తే ఇది కాస్త వేరుగా ఉంటుంది. 5 ఏళ్లలోపు పిల్లలకు మాత్రమే ఈ ఆధార్ కార్డులు ఇస్తారు. పిల్లల యెక్క వేలి ముద్రలు , ఐరిష్( కంటి పాప ) వంటి బయోమెట్రిక్ వివరాలు లేకుండానే ఈ కార్డులు జారీ చేస్తారు. కేవలం ఫోటో, పేరు, తల్లిదండ్రుల పేర్లతో కూడిన ప్రాథమిక సమాచారం మాత్రమే ఉంటుంది. తల్లిదండ్రుల ఆధార్ కార్డులతో అనుసంధానం చేస్తూ.. పిల్లలకు ఈ బ్లూ ఆధార్ కార్డ్‌ను జారీ చేస్తారు.