ప్రతిపక్షం, నకిరేకల్, ఏప్రిల్ 17: నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలోని జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. చిట్యాల ఎస్ఐ సైదాబాబు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల మండలం పేరేపల్లి గ్రామానికి చెందిన రూపని యాదయ్య (55) ద్విచక్ర వాహనంపై చిట్యాల పురపాలక పరిధిలోని శివనేని గూడెం గ్రామానికి బంధువుల ఇంటికి చావుకు వెళ్ళాడు. తిరిగి పేరేపల్లి గ్రామానికి వెళుతుండగా.. వెలిమినేడు గ్రామ పరిధిలో దశమి ల్యాబ్స్ ఎదురుగా బైక్ అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తల పగిలి అతను అక్కడికక్కడే మృతి చెందినట్లుగా గుర్తించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.