Trending Now

కాంగ్రెస్‌ పార్టీపై కేటీఆర్ సంచలన ట్వీట్..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: మరోసారి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం, రైతుల ప్రయోజనం కంటే రాజకీయమే ముఖ్యం అని తేలిపోయిందని ఎక్స్‌లో కాంగ్రెస్ పార్టీని బీఆర్‌ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ”మరోసారి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం, రైతుల ప్రయోజనం కంటే రాజకీయమే ముఖ్యం అని తేలిపోయింది. మేడిగడ్డ దగ్గర కాఫర్ డాం కట్టి, మరమత్తులు చేసి, నీళ్లు ఎత్తిపోసి రైతులను ఆదుకోమని కేసీఆర్ గారు డిమాండ్ చేస్తున్నారు, డిపార్ట్మెంట్ ఇంజినీర్లు చెయ్యాలి అని రిపోర్ట్ ఇచ్చిన తరువాత, కడతాం అని కూడా L &T company ముందుకు ఒచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కుత్సితమైన చిల్లర రాజకీయం చేస్తూ.. రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతూ, కేసీఆర్ గారిని బద్నాం చెయ్యాలనే ఒకే ఒక అజెండాతో కాఫర్ డాం కట్టకుండా రైతులని నిండా ముంచాలని చూస్తుంది. ఇంత నికృష్ట రాజకీయం కేవలం ఎన్నికలలో లాభం కోసమేనా..?” అని కేటీఆర్ సంచలన ట్విట్ చేశారు.

Spread the love

Related News

Latest News