నిర్మల్ (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి ) ఏప్రిల్ 18 : నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం దేవరకోట 67వ బ్రహ్మోత్సవా సందర్భంగా రావాలని కోరుతూ.. ఆలయ కమిటీ చైర్మన్ ఆమెడ శ్రీధర్ కు కమిటీ గౌరవ సభ్యులు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ప్రసిద్ధ ఆలయంలో ప్రతి ఏడాది తూచ తప్పకుండా అత్యంత భక్తి ప్రపత్తులతో ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పారు.
వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పించి ప్రభుత్వాలను ప్రణాళిక బద్ధమైన రీతిలో నిర్వహించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ ఆ మెడ శ్రీధర్ పేర్కొన్నారు. ఆయన వెంట అయ్యన్న గారి శ్రీనివాస్, రాజేశ్వర్, లింగారెడ్డి లతోపాటు పలువురు ఉన్నారు. 67వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికను గౌరవ శ్రీ కుచాడి శ్రీహరి రావు గారికి ఈ రోజు ఇవ్వడం జరిగింది.