ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: 2.3 కేజీల గంజాయిని పట్టుకున్న ఘటన సనత్‌నగర్ పీఎస్ పరిధిలోని ఎర్రగడ్డ భరత్‌నగర్ ఫ్లై ఓవర్ వద్ద చోటుచేసుకుంది. ఎర్రగడ్డ భరత్‌నగర్ ఫ్లై ఓవర్ వద్ద బచ్చల లోకేష్ అనే శ్రీకాకుళానికి చెందిన యువకుడిని పట్టుకుని అతని వద్ద నుండి రూ.57,500/- విలువ గల 2.3 కేజీల గంజాయి ని సైబరాబాద్ SOT పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అతను ఏపీలోని శ్రీకాకుళానికి చెందిన వాడని, జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చి మోతీనగర్‌లో నివాసం ఉంటూ ఇంటి నిర్మాణ పనులు చేసుకుంటూ.. గంజాయికి ఎక్కువ డిమాండ్ ఉన్నందున హైదరాబాద్ లో గంజాయిని అమ్ముకుని ఎక్కువ డబ్బులు సంపదించవచ్చని గంజాయిని సరఫరా చేస్తున్నారని తెలింది. ఇక్కడ కూలీలకు, నిర్మాణ రంగం లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన యువకులకు విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో సనత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.