Trending Now

రాధాకిషన్‌ రావు బెదిరించి ప్లాటు రాయుంచుకున్నాడు..

టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంలో బంధించి కొట్టాడు..

కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో రియల్టర్‌ ఫిర్యాదు..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ, ఓఎస్డీ రాధాకిషన్‌ రావు తనను బెదిరించి రూ. కోటి విలువైన ప్లాటును రాయించుకున్నాడని రియల్టర్‌ మునగపాటి సుదర్శన్‌ ఆవేదన వ్యక్తంచేశాడు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం వెలుగులోకి రావడంతో రియల్టర్‌ సుదర్శన్‌ కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసును సనత్‌నగర్‌కు బదిలీ చేయడంతో బాధితుడు సుదర్శన్‌ శుక్రవారం సనత్‌నగర్‌ పోలీ‌స్ స్టేషన్‌కు వచ్చి వాంగ్మూలం ఇచ్చాడు. రాధాకిషన్‌ రావు తనను సికింద్రాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంలో బంధించారని, పలుమార్లు కొట్టడంతోపాటు తన కుటుంబసభ్యులను భయబ్రాంతులను చేసినట్లు తెలిపాడు. తనకు డబ్బులు చెల్లించకుండానే అక్రమంగా తన పేరున ఉన్న ప్లాట్‌ను రాయించుకున్నారని చెప్పాడు. ‘‘పోలీసులు న్యాయం చేస్తారని నమ్మి ఫిర్యాదు చేశాను.. రాధాకిషన్‌ రావు బయటకి వచ్చేలోగా తన ప్లాట్‌ తనకు ఇప్పించాలి.’’ అని కోరాడు.

Spread the love

Related News

Latest News