Trending Now

గంటల్లోనే కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు..

ప్రతిపక్షం, గజ్వేల్ ఏప్రిల్ 20: కిడ్నాప్ కేసును మర్కుక్ పోలీసులు గంటల్లోనే ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలను సిద్దిపేట కమిషనర్ డాక్టర్ బి. అనురాధ తెలిపారు. మర్కుక్ పోలీస్ స్టేషన్ పరిధిలో కర్కపట్ల గ్రామంలో ఆస్పిరో ఫార్మా లో గత 8 సంవత్సరాలు నుండి బీహార్ కు చెందిన తబ్రీజ్ ఆలం చేస్తున్నాడు. అతనికి ముగ్గురు కుమారులు కాగా పెద్ద కుమారుడు తావిద్ ఆలం వయస్సు 7 సంవత్సరాలు కర్కపట్ల గవర్నమెంట్ స్కూల్లో రెండవ తరగతి చదువుతున్నాడు. రోజు మాదిరిగానే ఉదయం 9 గంటలకు స్కూలుకు వెళ్తానని చెప్పి.. ఇంట్లో నుంచి వెళ్ళాడు. కానీ, మూడు గంటల వరకు కూడా ఇంటికి రాకపోయేసరికి వారు చుట్టుపక్కల వెతికగా.. ఫలితం లేకుండా పోయింది. దీంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్ఐ మర్కుక్ మధుకర్ రెడ్డి, వెంటనే కరకపట్ల గ్రామానికి వెళ్లి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను చూసి ఒక గుర్తు తెలియని వ్యక్తి దాదాపు వయస్సు 20 సంవత్సరాలు ఉన్న వ్యక్తి చిన్న బాలుడిని భుజం మీద చేయి వేసి తీసుకువెళుతున్నట్టుగా గుర్తించారు. తర్వాత వెంటనే పిల్లాడి తండ్రికి ఒక కొత్త నెంబర్ నుండి ఫోన్ వచ్చి.. తన కొడుకును కిడ్నాప్ చేయడం జరిగిందని.. విడుదల చేయాలంటే 15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై వెంటనే మర్కుక్ ఎస్ఐ ఆధ్వర్యంలో ఒక టీమ్, గజ్వేల్ రూరల్ సీఐ ఆధ్వర్యంలో మరొక టీమ్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా హైదరాబాద్ టాస్క్ ఫోర్స్, రైల్వే పోలీస్ వారు సహకారంతో సాంకేతిక ఆధారాల ద్వారా నిందితులను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర పట్టుకున్నారు. ఈ కేసును కేవలం మూడు గంటలలోనే ఛేదించారు పోలీసులు.

అయితే ప్రధాన నిందితుడైన అనూప్ చౌదరి వ్యక్తి బాలుడి తండ్రి వద్ద గత ఎనిమిది నెలల క్రితం పని చేయడం జరిగింది. అప్పుడు అతను ఇతనికి కొంత డబ్బు బాకీ పడడం జరిగింది. ఎన్నిసార్లు అడిగినా కానీ అతని ఇవ్వకపోయేసరికి అతన్ని ఎలాగైనా భయపెట్టాలని ఉద్దేశంతో తన కొడుకును కిడ్నాప్ చేయడం జరిగింది. నిందితుగికి సహకరించిన ఇద్దరితో పాటుగా ప్రధాన నిందితుడిని జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు. పై కేసును మూడు గంటల్లో ఛేదించిన గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్ రెడ్డి, మర్కుక్ ఎస్ఐ మధుకర్ రెడ్డి అదేవిధంగా కానిస్టేబుల్స్ నరసింహ, సాయి, రాజిరెడ్డి లను కమిషనర్ అభినందించి, నగదు రివార్డు అందజేశారు.

Spread the love

Related News

Latest News