ఇంద్రవెల్లి అమరవీరులకు రాష్ట్ర మంత్రి సీతక్క ఘన నివాళి..
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 20 : ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, నిర్మల్ డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీ హరి రావు, అదిలాబాద్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణాలు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మారకస్తుపంపై పూలమాలలు వేసి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అమరవీరులకు జోహార్లు అంటూ నినాదాలు చేశారు. అమరవీరుల త్యాగాలు మహోన్నతమైనవని, వారి పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని మనమంతా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ప్రతి ఏడు ఇక్కడ నిర్వహించుకునే ఇంద్రవెల్లి అమరవీరుల కార్యక్రమాలను అత్యంత సాంప్రదాయ పద్ధతులలో నిర్వహించి.. అమరవీరులకు నివాళులు అర్పించడం మరువలేనిదని చెప్పారు. వారి వెంట ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్, బోథ్ మాజీ ఎమ్మెల్యే బాపూరావు, ఆసిఫాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ శ్యాం నాయక్, బోథ్ ఇంచార్జ్ ఆడే గజేందర్, తదితరులు ఉన్నారు.