Trending Now

ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే.. శ్రీరాముడు పాలన మొదలైంది : జగ్గారెడ్డి

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: గాంధీ.. నెహ్రులు రక్తపాతం లేకుండా శాంతి మార్గమే మంచి మార్గం అని నమ్మినవారు అని కాంగ్రెస్ లీడర్ జగ్గారెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి ఈ కామెంట్స్ చేశారు. నెహ్రు ప్రధానిగా ఉన్నప్పుడే శ్రీరాముడు పాలన మొదలైంది.. అదే పునాది.. రాహుల్ గాంధీ ముత్తాత నెహ్రు బ్లడ్‌లోనే త్యాగం ఉందన్నారు. నెహ్రు 16 ఏండ్లు జైలు జీవితం గడిపారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏకగ్రీవంగా నెహ్రును ప్రజలు మొదటి ప్రధానిని చేశారు. ఎన్నికల వ్యవస్థ తెచ్చిందే నెహ్రు.. బీజేపీ నేతలు కాదంటారా..? ఈ చరిత్రని కాదనే శక్తి బీజేపీ నేతలకు ఉందా..? అని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోడీ.. అమిత్ షా అప్పుడు పుట్టనే లేదు కిషన్ రెడ్డి.. బండి సంజయ్ నిన్న.. మొన్న పుట్టినోళ్లే.. అని అన్నారు.

దేశంలో ఆకలి చావులు ఉండొద్దని.. ప్రాజెక్టులు కట్టిన చరిత్ర నెహ్రుదే.. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు లు కట్టింది నెహ్రు నే.. కేసీఆర్.. కేటీఆర్.. హరీష్ మాట్లాడుతారు.. కాంగ్రెస్ ఏమి చేసింది అని ఇవన్నీ వాళ్లకు కనపడదన్నారు. ల్ కంపెనీ తెచ్చింది నెహ్రు.. పంచవర్ష ప్రణాళికలు, విదేశీ వ్యవహారాలు మొదలు పెట్టింది కూడా ఆయనే.. బీజేపీ వచ్చి మొదలుపెట్టిందా..? అని ఆయన ప్రశ్నించారు. శ్రీరాముడి చరిత్ర చదువుతున్నారు కానీ గాంధీ.. నెహ్రూల చరిత్ర అక్కరలేదా..? అని ప్రశ్నించారు. గాంధీ.. నెహ్రు ల చరిత్ర పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి.. సీఎం ని కలిసి చెప్తానని తెలిపారు. రామాయణం.. మహాభారతం చరిత్ర ఎలాగా ఉందో.. స్వతంత్రం తర్వాత గాంధీ కుటుంబానిది అలాంటి చరిత్ర అని ఆయన పేర్కొన్నారు. నేను లేవనెత్తిన అంశాలపై చర్చకు వచ్చే దమ్ము ఉందా..? గుండు సూది నుండి మొదలుకుని.. శాటిలైట్ వరకు తెచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. మా చరిత్ర చెప్పకండి.. కానీ అబద్ధపు ప్రచారం మాత్రం చేయకండి అని ఆయన విజ్ఞప్తి చేశారు.

Spread the love

Related News

Latest News