ప్రతిపక్షం, నిర్మల్ జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 23 : నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలోని భైంసా పట్టణంలో గల నర్సింహా నగర్ లోని శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయంలో మంగళవారం ముధోల్ శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ జయంతిని పురస్కరించుకొని పలు విషయాలు తెలిపారు.
ఆలయాల అభివృద్ధికి తన వంతుగా కృషి చేయడం జరుగుతుందని భరోసా కల్పించారు. హనుమాన్ మాల ధరుణ స్వాములు అందరూ కఠోరమైన దీక్షలను పాటిస్తూ.. స్వామివారికి కృపాకు పాత్రులవుతున్నారని చెప్పారు.
నేడు హనుమాన్ జయంతి..
చైత్ర మాసం శుక్ల పక్షం పౌర్ణమి రోజున అంజనీ దేవి కుమారుడిగా ఆంజనేయుడు జన్మించాడని నమ్ముతారు. అందుకే హిందూ మతంలో హనుమాజ్ జయంతికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్ 23న హనుమాన్ జయంతి జరుపుకోనున్నారు. హనుమంతునికి ఎంతో ప్రీతికరమైన మంగళవారం రోజు హనుమాన్ జయంతి రావడం అత్యంత శుభకరం. హనుమంతుడిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు ఉపవాసం ఉంటారు.