నిర్మల్ డీసీసీ అధ్యక్షులు కే. శ్రీహరి రావు
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 23 : ఆధ్యాత్మిక చింతనతో ముందుకెళ్తే మానసిక ప్రశాంతత కలుగుతుందని నిర్మల్ డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు పేర్కొన్నారు. మంగళవారం నిర్మల్ పట్టణంలోని పలు ప్రాంతాలలో ఆయన హనుమాన్ జయంతిని పురస్కరించుకొని వీరాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి యేడు హనుమాన్ జయంతిని పురస్కరించుకొని అత్యంత భక్తి ప్రపత్తులతో కఠోర ఉపవాస దీక్షలు ఉంటున్న హనుమాన్ మాలధారణ స్వాములను ఈ సందర్భంగా అభినందించారు.
నిత్యం ఆధ్యాత్మిక చింతనతో ఉండి కఠోర ఉపవాస దీక్షలు పాటిస్తున్న హనుమాన్ మాల ధరణ చేస్తున్న వారందరి ఈ ఆధ్యాత్మిక త్యాగం ఈ భవిష్యత్తులో మంచి ఆరోగ్యాన్ని.. మానసిక ప్రశాంతతను కలుగజేస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన వెంట నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, నాయకులు గాజుల రవి, అరవింద్, గణేష్, భూపతి నర్సయ్యలతో పాటు పలువురు ఉన్నారు.